Pawan Kalyan: పవన్ వ్యాఖ్యలపై అంబటి స్పందన

former minister ambati rambabu sensational comments on deputy cm pawan kalyan
  • పవన్ కల్యాణ్‌పై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ 
  • పవన్ హోంమంత్రి అయితే ఏమి జరుగుతుందని ప్రశ్నించిన అంబటి
  • అధికారంలోకి వచ్చాక ఒక్క మహిళనైనా తీసుకొచ్చారా అని నిలదీసిన అంబటి
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలు అదృశ్యమయ్యారని గతంలో ఆరోపించిన పవన్ కల్యాణ్ .. ఇప్పటిదాకా ఆ ఆదృశ్యమైన వాళ్లలో ఒక్కరినైనా కనిపెట్టారా? అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని పవన్ కల్యాణ్‌ అన్నారని, తాము మొదటి నుంచి అదే కదా చెబుతున్నామన్నారు. పాలన చేతకాక పవన్ ఇలా తప్పించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతుంటే పవన్ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. పిఠాపురంలో కూటమి నేతలు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే పవన్ ఏమి చేశారు? పిఠాపురం ఘటనలో ఎంత మందిని అరెస్టు చేశారు? పైగా ప్రశ్నిస్నే .. డైవర్షన్ పాలిటిక్సా ? అంటూ ధ్వజమెత్తారు. 

మైక్ ముందే హోంమంత్రి అనిత, పోలీస్ అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసే అధికారం కూడా తనకు లేదని అన్నారు. పవన్ కల్యాణ్ హోంమంత్రి అయితే ఏమి జరుగుతుందని ప్రశ్నించారు. హోంమంత్రికి హోమ్‌లోనే (కూటమి) అసంతృప్తి నెలకొందని ఎద్దేవా చేశారు. హోంమంత్రి తీసుకొని ప్రతాపం చూపండి.. స్వామి ఆదిత్యనాధ్ అవుతారో..? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణయిస్తుందన్నారు. పవన్ ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ ఊగిపోతూ మాట్లాడితే ఏమి జరుగుతుందని అంబటి అన్నారు. 
Pawan Kalyan
Ambati Rambabu
YSRCP
AP Politics

More Telugu News