Pawan Kalyan: పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూముల వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan arrives Saraswati Power Lands in Palnadu district
  • పల్నాడు జిల్లా మాచవరం మండలంలో సరస్వతి పవర్ సంస్థకు భూములు
  • నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేదా అనేది నిర్ధారించనున్న పవన్
  • రైతులతో మాట్లాడనున్న డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ భూముల వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం మాచవరం మండలంలోని వేమవరం, చెన్నాయపాలెంలో ఉన్న సరస్వతి పవర్ భూములను పరిశీలిస్తున్నారు. ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందా, లేదా అనేది అధికారులతో కలిసి నిర్ధారించనున్నారు. 

పవన్ వెంట గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉన్నారు. పవన్ తన పర్యటన సందర్భంగా, భూములు ఇచ్చిన రైతులతో మాట్లాడనున్నారు. 

పవన్ రాకతో సరస్వతి పవర్ భూముల వద్ద భారీ కోలాహలం నెలకొంది. కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో, వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Pawan Kalyan
Saraswati Power
Lands
Palnadu District
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News