Agra: ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం

MiG 29 fighter jet crashes near Agra pilot ejects to safety
  • పంజాబ్‍‌‌లోని అడంపూర్ నుంచి అగ్రాకు వెళ్తున్న జెట్ ఫైటర్
  • ఆగ్రా సమీపంలో పొల్లాలో కుప్పకూలిన విమానం
  • సురక్షితంగా బయటపడిన పైలట్
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిగ్-29 విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళుతోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం పొలాల్లో కూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగాయి. అయితే పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. పొలాల్లో పడిన విమానం నుంచి మంటలు వస్తుంటే స్థానికులు అక్కడ గుమికూడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Agra
Uttar Pradesh
Aeroplane

More Telugu News