ఈసారి మంత్రి పొంగులేటిని టార్గెట్ చేసిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- తెలంగాణకు కొత్త సీఎం వస్తారని ఇటీవల వ్యాఖ్యానించిన ఏలేటి
- తాజాగా, పొంగులేటికి పదవీగండం ఉందంటూ జోస్యం
- ఈడీ దాడుల కారణంగా పదవిని కోల్పోతారని వెల్లడి
పొంగులేటికి త్వరలోనే పదవీ గండం తప్పదని అన్నారు. ఇటీవల ఈడీ దాడుల కారణంగా, పొంగులేటి పదవి కోల్పోతారని జోస్యం చెప్పారు. హన్మకొండలోని హంటర్ రోడ్డులో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేడు మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో సీఎంకు, మంత్రులకు మధ్య సమన్వయం సత్సంబంధాలు లేవని విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకుండా, ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి లేఖ రాయడం సరికాదని అన్నారు.