బ్రిడ్జిపై పట్టాలు శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన ట్రైన్.. కేరళలో నలుగురు దుర్మరణం
- పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోరం
- ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళుతున్న కేరళ ఎక్స్ ప్రెస్
- పట్టాలపై మూడు మృతదేహాలు గుర్తించిన పోలీసులు
బాధిత కుటుంబ సభ్యులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలక్కాడ్ జిల్లాలోని షోరనూర్ రైల్వే స్టేషన్ సమీపంలో భరతపూజ నదిపై బ్రిడ్జి ఉంది. శనివారం సాయంత్రం బ్రిడ్జిపై చెత్తను తొలగించేందుకు నలుగురు కార్మికులు వెళ్లారు. వారు తమ పనిలో నిమగ్నమై ఉండగా కేరళ ఎక్స్ ప్రెస్ అదే ట్రాక్ పై దూసుకొచ్చింది. ట్రైన్ దూసుకొస్తున్న విషయం చివరి క్షణంలో గమనించినా తప్పించుకునే దారిలేక కార్మికులు పట్టాలపై నలిగిపోయారు. కాగా, మూడు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు.. నాలుగో కార్మికుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భరతపూజ నదిలో స్థానికులతో కలిసి వెతుకుతున్నారు.