kanguva: కంగువ చిత్ర నిర్మాతపై కేసు

case filed in court against kanguva producer gnanavel raja
  • నిర్మాత జ్ఞానవేల్ రాజాపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
  • రూ.45కోట్లు తమకు జ్ఞానవేల్ రాజా బకాయి ఉన్నాడని ఫిర్యాదు
  • తమ బకాయి చెల్లించే వరకూ కంగువ చిత్ర రిలీజ్‌కు అనుమతులు ఇవ్వొద్దని వినతి
భారీ బడ్జెట్ మూవీ కంగువ ఈ నెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై మద్రాస్ హైకోర్టులో కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తమ వద్ద నుండి సుమారు రూ.99 కోట్ల 22 లక్షలు అప్పుగా తీసుకున్నారని ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ ఫిర్యాదులో పేర్కొంది. 

తీసుకున్న అప్పులో రూ.45 కోట్లు మాత్రమే చెల్లించారని, తమకు పూర్తి మొత్తం బకాయి చెల్లించే వరకూ 'కంగువ' చిత్రం విడుదలకు అనుమతులు ఇవ్వొద్దంటూ కోర్టుకు ఆ సంస్థ విన్నవించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ కోర్టు.. వాదనలు వినేందుకు నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. నిర్మాతకు వ్యతిరేకంగా మద్రాస్ కోర్టులో కేసు విచారణ జరగనుండటంతో ఈ ప్రభావం కంగువ మూవీ విడుదలపై పడుతుందా లేదా అన్న దానిపై సర్వాత్రా చర్చ జరుగుతోంది.   
 
కాగా, కంగువ మూవీలో స్టార్ హీరో సూర్య రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించగా, బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో సందడి చేశారు. 
kanguva
Movie News
chenni court
producer gnanavel raja

More Telugu News