Mumbai Test: ముంబై టెస్టులో చెలరేగిన జడేజా, సుందర్... తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ ఆలౌట్

New Zealand bowled out for 235 runs in Mumbai Test against India
  • 235 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్
  • జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో విజృంభణ
  • 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డారిల్ మిచెల్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో చెలరేగడంతో 235 పరుగులకే పర్యాటక జట్టు ఆలౌట్ అయింది. మరో వికెట్ పేసర్ ఆకాశ్ దీప్‌కు దక్కింది.

82 పరుగులు సాధించిన డారిల్ మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో  విల్ యంగ్ 71, టామ్ లాథమ్ 28, డెవాన్ కాన్వే 4, రచిన్ రవీంద్ర 5, టామ్ బ్లండెల్ 0, గ్లెన్ ఫిలిప్స్ 17, ఇష్ సోధి 7, మ్యాట్ హెన్రీ 0, అజాజ్ పటేల్ 7, విలియం ఒరూర్కే 1 (నాటౌట్) పరుగులు సాధించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.  
Mumbai Test
India vs New Zealand
Cricket
Team India
Ravindra Jadeja

More Telugu News