Nara Bhuvaneswari: మా అబ్బాయి రామ్ సినీ ప్రస్థానం ప్రారంభిస్తున్నందుకు థ్రిల్లింగ్ గా ఉంది: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari says she thrilled that Ram starts his cine journey
  • నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరోగా రామ్
  • వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో చిత్రం ద్వారా ఎంట్రీ 
  • రామ్ కు విషెస్ తెలిపిన నారా భువనేశ్వరి 
నందమూరి వంశం నుంచి నాలుగో తరం హీరో తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ తనయుడు తారక రామారావు (రామ్) ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అవుతున్నాడు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి స్పందించారు. 

"మా అబ్బాయి రామ్ దర్శకుడు వైవీఎస్ చౌదరి తదుపరి చిత్రం ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నందుకు ఎంతో థ్రిల్లింగ్ గానూ, గర్వంగానూ ఉంది. రామ్ తెలుగు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించాలని, చిత్రసీమలో విజయం సాధించాలని, మా కుటుంబానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. 

నందమూరి జానకిరామ్ తనయుడిగా, నా సోదరుడు దివంగత నందమూరి హరికృష్ణ మనవడిగా, లెజెండరీ ఎన్టీఆర్ గారి మునిమనవడిగా మా కుటుంబ ఘనతర వారసత్వాన్ని రామ్ ముందుకు తీసుకెళతాడన్న నమ్మకం నాకుంది" అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. రామ్ ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు.
Nara Bhuvaneswari
Ram
Taraka Rama Rao
Debut
YVS Chowdhary
Tollywood

More Telugu News