Adilabad District: పుష్ప సినిమా తరహాలో గంజాయి తరలింపు... ట్యాంకర్ డ్రైవర్ అరెస్ట్

Adilabad police arrest Lorry tanker driver for Ganja
  • రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ వెళుతోన్న ట్యాంకర్ లారీ
  • డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో తనిఖీ చేసిన వాంకిడి పోలీసులు
  • ట్యాంకర్ మధ్య భాగంలోని అరల్లో రూ.72.50 లక్షల విలువ చేసే గంజాయి గుర్తింపు
ఆదిలాబాద్ జిల్లాలో పుష్ప సినిమా తరహాలో ట్యాంకర్‌లో గంజాయి తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. పుష్ప సినిమాలో పాల ట్యాంకర్‌లో ఎర్ర చందనం తరలిస్తారు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలోనూ అలాంటి ఘటన వెలుగు చూసింది. కుమురంభీమ్ జిల్లా వాంకిడి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఈరోజు సాయంత్రం పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది.

ఏపీలోని రాజమహేంద్రవరం నుంచి ఓ ట్యాంకర్ లారీ మధ్యప్రదేశ్ వెళుతోందని, డ్రైవర్ తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. అయితే ట్యాంకర్ మధ్య భాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన అరలలో రూ.72.50 లక్షల విలువ చేసే 290 కిలోల గంజాయిని గుర్తించారు. డ్రైవర్ బల్వీర్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Adilabad District
Ganja
Telangana
Andhra Pradesh

More Telugu News