Jharkhand: ఝార్ఖండ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో భట్టి విక్రమార్క

Mallu Bhattivikramarka for Jharkhand star campainer list
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కేసీ వేణుగోపాల్
  • జాబితాలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ
  • ఝార్ఖండ్‌లో ఓ వీధిలో ఛాయ్ తాగిన భట్టివిక్రమార్క
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేరును అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేడు జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు భట్టివిక్రమార్క కూడా ఉన్నారు.

మరోవైపు, భట్టి విక్రమార్క ఇప్పటికే ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అక్కడి నేతలతో సమావేశమవుతున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజల వద్దకు వెళుతున్నారు. ఝార్ఖండ్‌లో తన పర్యటనకు సంబంధించి భట్టివిక్రమార్క ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బోకారోలో ఓ చాయ్ దుకాణంలో టీ తాగారు. వారితో ముచ్చటిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు.
Jharkhand
Mallu Bhatti Vikramarka
Congress

More Telugu News