Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Rush Of Devotees In Tirumala 12 Hours Time For Sarvadarshan
   
దీపావ‌ళి ప‌ర్వ‌దినం కావ‌డంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్య‌లో భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకునేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ప్ర‌స్తుతం 10 కంపార్టు మెంట్లు నిండిపోయాయి. ఇక‌ టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల స‌మ‌యం ప‌డుతోంది. ఇక బుధ‌వారం శ్రీవారిని 59,140 మంది భక్తులు దర్శించుకున్న‌ట్లు టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. వీరిలో 16, 211 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న‌ శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు వచ్చింది.
Tirumala
TTD
Andhra Pradesh

More Telugu News