Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

Telangana Govt Increasing DA For Govt Employees
  • ఉద్యోగులకు డీఏను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
  • డియర్‌నెస్ అలవెన్స్‌ను 3.65 శాతం పెంచుతూ ఉత్తర్వులు
  • 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు బకాయిలు చెల్లించనున్న ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దీపావళి సందర్భంగా శుభవార్త అందించింది. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (డీఏ) 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి వర్తిస్తుందని వెల్లడించింది. నవంబర్ జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు చేయనున్నారు. 2022 జులై 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు.

వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేస్తారు. మిగిలిన 90 శాతాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. రిటైర్డ్ ఉద్యోగులకు డీఏ బకాయిలను 2025 జనవరి నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
Telangana
DA
Salary
Employees

More Telugu News