Revanth Reddy: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు... కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో రేవంత్ రెడ్డి

Congress releases list of star campaigners for Maharashtra
  • నవంబర్‌లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు
  • స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్
  • జాబితాలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ పేర్లు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఉంది. నవంబర్‌లో మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో జరుగుతుండగా, ఝార్ఖండ్ ఎన్నికలు రెండు దఫాల్లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్లు ఉన్నాయి. జాబితాలో కేసీ వేణుగోపాల్, అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్, డీకే శివకుమార్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, జి. పరమేశ్వర, ఎంబీ పాటిల్, కన్హయ కుమార్, అల్కా లాంబా తదితరులు కూడా ఉన్నారు.
 
Revanth Reddy
Maharashtra
Assembly Elections
Mallikarjun Kharge

More Telugu News