Vijay Madduri: జూబ్లీహిల్స్‌లోని విజయ్ మద్దూరి నివాసంలో పోలీసుల సోదాలు

Police searches at Vijay Madduri house
  • జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లోని ఇంటిలో మోకిల పోలీసుల సోదాలు
  • రాజ్ పాకాల ఫాంహౌస్‌లో కేసులో విజయ్ మద్దూరిపై కేసు
  • విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు
జన్వాడ ఫాంహౌస్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో విజయ్ మద్దూరి ఇంటిలో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రెండు రోజుల క్రితం పోలీసులు సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లోని విజయ్ మద్దూరి నివాసంలో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. 

జన్వాడ ఫాంహౌస్‌లో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. విజయ్‌కి కొకైన్ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజ్ పాకాల తనకు కొకైన్ ఇచ్చాడని విజయ్ మద్దూరి చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం దీనిని ఖండించారు.
Vijay Madduri
Janwada Farm House
Hyderabad

More Telugu News