AP Govt: ఏపీలో 32 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల బ‌దిలీ

32 Deputy Collectors Transferred in AP
  • ఈ మేర‌కు సీఎస్‌ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వుల జారీ
  • ఏడుగురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఆర్‌డీఏలో పోస్టింగ్‌లు 
  • ప్రోటోకాల్ డైరెక్ట‌ర్‌గా టి.మోహ‌న్ రావు నియామ‌కం
ఏపీ ప్ర‌భుత్వం ఒకేసారి 32 మంది డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌ను బ‌దిలీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక బ‌దిలీల‌లో భాగంగా ఏడుగురు డిప్యూటీ క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఆర్‌డీఏలో పోస్టింగ్‌లు ఇచ్చారు. 

ఇందులో భాగంగా ప్రోటోకాల్ డైరెక్ట‌ర్‌గా టి.మోహ‌న్ రావును నియ‌మించ‌డం జ‌రిగింది. అలాగే ఏపీ శిల్పారామం సొసైటీ సీఈఓగా వి.స్వామినాయుడు, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా పి.ర‌చ‌న‌, సీసీఎల్ఏ స‌హాయ కార్య‌ద‌ర్శిగా డి.ల‌క్ష్మారెడ్డి, శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యం ఈఓగా టి. బాపిరెడ్డిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. 
AP Govt
Deputy Collector
Andhra Pradesh

More Telugu News