TTD: టీటీడీ అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి వ్యాఖ్యలు... టీటీడీ స్పందన

ttd reply on srinivasananda saraswati swamiji comments
  • టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిపై ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపణలు
  • స్వామీజీ అడిగిన మేర దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో ఆరోపణలు చేశారన్న టీటీడీ 
  • అధికారిని కించపరుస్తూ మాట్లాడటం స్వామీజీ స్థాయికి తగదన్న టీటీడీ
టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తమకు శ్రీవారి దర్శన టికెట్లు ఇవ్వకుండా అవమానించారంటూ శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ ఆరోపణలు చేశారు. స్వామిజీ ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. వాస్తవానికి సదరు స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక దర్శనంతో పాటు తిరుమలలో వసతి కల్పించాలని టీటీడీ అధికారులను కోరారని చెప్పారు. అయితే వారు అడిగిన మేరకు వసతి కల్పించేందుకు అంగీకరించడం జరిగిందన్నారు. 

అయితే సాధారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆ రోజున దర్శనం కొరకు ఇంత మందికి ఇవ్వడం సాధ్యం కాదని, 600 మంది సంఖ్యను తగ్గించాలని అదనపు ఈవో కోరారని, అయితే సదరు స్వామీజీ తాము అడిగిన 600 మందికి దర్శనం కల్పించాలని పట్టుబట్టడం జరిగిందని టీటీడీ తెలిపింది. తాము అడిగినంతమందికి శ్రీవారి దర్శనం టికెట్లు ఇవ్వలేదన్న కోపంతో మీడియా సమక్షంలో టీటీడీ అధికారిని తీవ్ర స్థాయిలో కించపరుస్తూ స్వామీజీ మాట్లాడారని, ఇది స్వామీజీ స్థాయికి తగదని టీటీడీ పేర్కొంది.
TTD
Tirumala
srinivasananda saraswati swamiji

More Telugu News