Telangana: తెలంగాణ సచివాలయ సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కీలక ఆదేశాలు

CSO orders to Telangana secretariat security personals
  • సచివాలయం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉందని వెల్లడి
  • సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందన్న సీఎస్‌వో
  • రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావాలని సూచన
తెలంగాణ సచివాలయ భద్రతా సిబ్బందికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్‌వో) కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయం చుట్టూ రెండు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు.

సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని వెల్లడించారు. పోలీసు అధికారులపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వాట్సాప్ గ్రూప్‌ల నుంచి ఎగ్జిట్ కావాలని సూచించారు. ప్రభుత్వం, పోలీస్ శాఖకు వ్యతిరేకంగా వచ్చే పోస్టులను షేర్ చేయవద్దని, లైక్ కొట్టవద్దన్నారు. తప్పు జరిగితే శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు.
Telangana
Secretariat

More Telugu News