Narendra Modi: బార్సిలోనా జ‌ట్టు విజ‌యంతో భార‌త్‌లోనూ సంద‌డి: ప్రధాని మోదీ

PM Modi says Barcelona victory created buzz in India
  • లాలిగా టోర్నీలో బార్సిలోనా జ‌ట్టు విజ‌యంపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు
  • స్పానిష్ ఫుట్‌బాల్ ఆట‌ను భార‌తీయులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారని వెల్లడి
  • స్పెయిన్ ప్ర‌ధాని గుజ‌రాత్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా చ‌ర్చ‌నీయమైన మోదీ స్పంద‌న‌
ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వ‌డోద‌ర ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్పెయిన్ ప్ర‌ధాని స‌మ‌క్షంలో బార్సిలోనా ఫుట్‌బాల్ జ‌ట్టు విజ‌యంపై స్పందించారు. లాలిగా టోర్నీలో భాగంగా రియ‌ల్ మాడ్రిడ్, బార్సిలోనా జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో 4-0 తేడాతో బార్సిలోనా విజ‌యం సాధించింది. ఈ విజ‌యంపై ప్ర‌ధాని మోదీ స్పందిస్తూ, బార్సిలోనా ఫుట్ బాల్ జ‌ట్టుపై ప్ర‌శంస‌లు కురిపించారు. 

"స్పానిష్ ఫుట్‌బాల్ అంటే భార‌తీయులకు ఇంత‌గానో ఇష్టం అని వెల్లడించారు. నిన్న జ‌రిగిన రియ‌ల్ మాడ్రిడ్‌, బార్సిలోనా మ్యాచ్ గురించి భారత్ లోనూ చ‌ర్చించుకున్నారని తెలిపారు. స్పెయిన్‌లో మాదిరిగానే బార‌త్‌లోనూ సంద‌డి వాతావ‌ర‌ణం నెలకొంద‌ని నేను చెప్ప‌గ‌ల‌ను అని ప్ర‌ధాని మోదీ వ‌డోద‌ర రోడ్‌షోలో ప్ర‌సంగిస్తూ వివ‌రించారు. కాగా, మోదీకి ఫుట్‌బాల్‌పై ఉన్న ప‌రిజ్ఞానం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రింది. 

ఇవాళ వడోదరలో ప్రధాని మోదీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కలిసి సైనిక రవాణా విమానాల తయారీ పరిశ్రమ ప్రారంభించారు. వ‌డోద‌రా విమానాశ్ర‌యం నుంచి టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వ‌ర‌కు 2.5 కి.మీ. మేర సాగిన ఈ రోడ్‌షో లో ఇద్ద‌రు నేత‌లు ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 
Narendra Modi
Barcelona Football Team
La Liga
Spain
Vadodara

More Telugu News