VIP Break Darshans: ఈ నెల 31న తిరుమలలో వీఐపీ దర్శనాలు రద్దు

 TTD cancelled VIP Break Darshans on Oct 31
  • అక్టోబరు 31న దీపావళి
  • సిఫారసు లేఖలపై వీఐపీ దర్శనాలు అనుమతించబోమన్న టీటీడీ
  • ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు
తిరుమలలో అక్టోబరు 31న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని ఆ రోజున టీటీడీ నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో, దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహాయింపు ఉంటుంది. దీనిపై టీటీడీ స్పందిస్తూ, అక్టోబరు 30న సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
VIP Break Darshans
Tirumala
TTD

More Telugu News