Rajanna Sircilla District: బెటాలియన్ పోలీసుల నిరసన... సిరిసిల్ల ఎస్పీ కాళ్లపై పడిన కానిస్టేబుల్

Constable falls at feet of Sircilla SP seeking justice amid ongoing protest
  • సిరిసిల్ల కమాండెంట్ ఆఫీస్ వద్ద సర్దాపూర్ బెటాలియన్ పోలీసుల నిరసన
  • రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు
  • బెటాలియన్ వద్దకు వచ్చిన ఎస్పీ కాళ్ల మీద పడిన ఓ కానిస్టేబుల్
ఓ బెటాలియన్ పోలీసు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ కాళ్లపై పడ్డారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణవ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

సర్దాపూర్‌లోని తెలంగాణ స్పెషల్ పోలీస్ (ఏఆర్) 17వ బెటాలియన్‌కు చెందిన ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుళ్లు శనివారం నాడు సిరిసిల్ల కమాండెంట్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆందోళన చేస్తున్న బెటాలియన్ పోలీసుల వద్దకు సిరిసిల్ల ఎస్పీ మహాజన్ వచ్చారు.

బెటాలియన్ పోలీసులను ఆందోళన విరమించాలని ఎస్పీ కోరారు. ఈ సమయంలో ఓ కానిస్టేబుల్ తమకు న్యాయం కావాలంటూ ఎస్పీ కాళ్ల మీద పడ్డాడు. ఎస్పీ, అతని గన్‌మన్‌లు అతనిని పైకి లేపే ప్రయత్నం చేసినప్పటికీ అతను పైకి లేవలేదు. మమ్మల్ని కాపాడండి సర్... మాకు న్యాయం చేయండి సర్ అంటూ కంటతడి పెట్టుకున్నారు. కానిస్టేబుళ్లు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని ఆయన ఏడుస్తూ చెప్పారు. ఉన్నతాధికారుల ఇళ్లలో బలవంతంగా పని చేయిస్తున్నారని వారు వాపోయారు.
Rajanna Sircilla District
Police
Telangana

More Telugu News