Johnny Master: చంచల్‌గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
- లైంగిక ఆరోపణల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్
- బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- జైలు నుంచి వెళుతుండగా మాట్లాడేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అతని బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ రోజు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఈరోజు సాయంత్రం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
జైలు లోపలి నుంచి ఆయన కారులో బయటకు వచ్చారు. ఈ సమయంలో ఆయనను మీడియా పలకరించే ప్రయత్నం చేసింది. "సర్, ఏమైనా మాట్లాడుతారా?", "మాస్టర్ గారూ, దిగి మాట్లాడండి?" అని మీడియా ప్రతినిధులు అడిగారు. అయితే ఆయన కారులో నుంచే అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్లిపోయారు.