Mudra Loan: మోదీ ప్రభుత్వం శుభవార్త... ముద్ర లోన్ ఇక రెండింతలు!

Loan limit under Pradhan Mantri Mudra Yojana increased to rs 20 Lakh
  • పీఎంఎంవై కింద ఇప్పటి వరకు రూ.10 లక్షల రుణం
  • రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ ప్రకటన
  • బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల ద్వారా ముద్ర రుణాలు
కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద ఇచ్చే రుణ పరిమితిని రెండింతలు చేసింది. ఈ స్కీం కింద ఇప్పటి వరకు రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్నారు. దీనిని రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు.

బడ్జెట్ ప్రవేశపెట్టిన 2024 జులై 23 నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు తెలిపారు. ఆర్థిక మద్దతు, కొత్త వ్యాపారాల అభివృద్ధి, విస్తరణకు మద్దతు ఇవ్వడం పీఎంఎంవై ప్రధాన ఉద్దేశం. ఈ స్కీంను 2015లో మోదీ ప్రభుత్వం ప్రారంభించింది. సమీప బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి ముద్ర లోన్లు వస్తాయి.
Mudra Loan
PMMY
Narendra Modi
Business News

More Telugu News