Alleti Maheshwar Reddy: వారికి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాలు ఇచ్చాకే కూల్చేయండి: మహేశ్వర్ రెడ్డి

BJPLP Maheshwar Reddy faults TG government over Hydra demolitions
  • పేదల ఇళ్లను కూల్చివేయడం దారుణమన్న బీజేపీ శాసన సభాపక్ష నేత
  • జేసీబీలకు అడ్డుపడి అయినా కూల్చివేతలు ఆపేస్తామని హెచ్చరిక
  • దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్న
మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నిరుపేదలకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో స్థలాలు కేటాయించిన తర్వాతే ఇళ్లను కూల్చివేయాలని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ పునరుజ్జీవం పేరిట పరీవాహక ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చడం దారుణమన్నారు. జేసీబీలకు అడ్డుపడి అయినా సరే కూల్చివేతలను ఆపివేస్తామని హెచ్చరించారు.

జియాగూడ, లంగర్ హౌస్ మూసీ పరీవాహక ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఐదు దశాబ్దాలుగా వారు నివసిస్తుంటే ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటే ఎలా? అని ధ్వజమెత్తారు. 

ఇల్లు కట్టుకోవడం అందరికీ చిరకాల వాంఛగా ఉంటుందని, అలాంటి ఇంటిని కూల్చివేయడం పట్ల బాధితులు ఆందోళన చెందుతున్నారన్నారు. పేదల సమస్యలను పరిష్కరించకుండా కూలగొడతామంటే ఊరుకునేది లేదన్నారు.
Alleti Maheshwar Reddy
BJP
HYDRA
Hyderabad

More Telugu News