Nara Lokesh: ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ

AP Minister Nara Lokesh held meeting with NVIDIA CEO Jensen Huang
  • ముంబయిలో నారా లోకేశ్ కీలక భేటీ
  • పలు అంశాలపై జెన్సన్ హువాంగ్ తో చర్చ
  • ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి
ప్రపంచ ప్రఖ్యాత ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంప్యూటింగ్ సంస్థ ఎన్ విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ నేడు ముంబయిలో భేటీ అయ్యారు. 

ఏపీ పాలనావ్యవహారాల్లో వేగవంతమైన, మెరుగైన సేవలకు ఏఐ టెక్నాలజీని వినియోగించాలన్నది తమ అభిమతం అని లోకేశ్ పేర్కొన్నారు. అమరావతిలో  ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సలహాలు, సూచనలు ఇచ్చి సహకరించాల్సిందిగా జెన్సన్ హువాంగ్ ను మంత్రి లోకేశ్ కోరారు. 

ఇందుకు సానుకూలంగా స్పందించిన హువాంగ్ రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీ ద్వారా అంతర్జాతీయంగా ఎటువంటి విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోబోతున్నాయో వివరించారు. 

కాగా, స్పీచ్ రికాగ్నిషన్, మెడికల్ ఇమేజింగ్, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ సంస్థల్లో ఏఐ వినియోగానికి అవసరమైన కంప్యూటింగ్ పవర్ టూల్స్, అల్గారిథమ్ లను ఎన్ విడియా అందిస్తోంది. 

ఇటీవల బ్లూమ్ బర్గ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్ విడియా 3.5 ట్రిలియన్ల మార్కెట్ విలువ కలిగి ఉండగా, కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన జెన్సన్ హువాంగ్‌ ప్రపంచంలో 11వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు.
Nara Lokesh
Jensen Huang
NVIDIA
AI
Andhra Pradesh

More Telugu News