Suicide: బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హరిత

IT employee suicide in Hyderabad
  • హైదరాబాద్ లో పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు
  • తాజాగా రామంతాపూర్ లో ఐటీ ఉద్యోగిని సూసైడ్
  • డీఎస్ఎల్ లో పని చేస్తున్న హరిత
సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు హైదరాబాద్ లో నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రామంతాపూర్ లో ఉంటున్న ఐటీ ఉద్యోగిని హరిత బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

ఆమె రామంతాపూర్ లోని డీఎస్ఎల్ లో పని చేస్తున్నారు. హరిత ఈ ఘటనకు పాల్పడిన వెంటనే ఆమెను సహోద్యోగులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. లాలాగూడలో ఉంటున్న హరిత తండ్రికి సమాచారం అందించారు. ఆర్థిక ఇబ్బందులే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు.
Suicide
Hyderabad
IT

More Telugu News