Ananya Nagalla: అలా చేశాను కాబట్టే సక్సెస్‌ అయ్యాను అనుకుంటారు: అనన్య నాగళ్ల

They think I am successful because I did that says Ananya Nagalla
  • ఇటీవల ఊహించని ప్రశ్నకు అనన్య షాక్‌ 
  • మా అమ్మ గర్వపడే సినిమా పొట్టేల్‌ అని తాజాగా వెల్లడి
  • ఐదేండ్ల నుంచి ప్రతి రోజు ఇంట్లో పోరాడుతున్నానని వివరణ
అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం పొట్టేల్‌. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అనన్య ఈ చిత్రం పబ్లిసిటిలో పాల్గొంటున్నారు. ఇటీవల పొట్టేల్‌ సినిమా పాత్రికేయుల సమావేశంలో అనన్య క్యాస్టింగ్‌ కౌచ్‌కు సంబంధించిన ప్రశ్నను ఎదుర్కొన్నారు. కమిట్‌మెంట్‌ను ఫేస్‌ చేశారా? అని ఓ లేడీ జర్నలిస్ట్‌ ఊహించని విధంగా ఆమెను ప్రశ్నించడం హాట్‌టాపిక్‌గా మారింది. 

ఈ ప్రశ్నతో ఒకేసారి యావత్‌ సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. సోషల్‌ మీడియాలో కూడా ఇది వైరల్‌గా మారింది. తాజాగా అనన్య పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడారు. ''కమిట్‌మెంట్‌ ఇచ్చారా? అనే ప్రశ్నను ఇంత డైరెక్ట్‌గా ఎలా అడుగుతారు? వాళ్లకు సంస్కారం లేదా? అనిపించింది. ఆ ప్రెస్‌మీట్‌లో నా కుటుంబ సభ్యులు, రిలేటివ్స్‌ ఉన్నారు. చాలా మంది లైవ్‌ చూస్తున్నారు. నేను కెరీర్‌ మొదలుపెట్టిన ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రతి రోజు ఇంట్లో ఫైట్‌ చేసి షూటింగ్‌కు వస్తాను. 

ఎందుకంటే సినీ పరిశ్రమలోకి రావడం మా ఇంట్లో ఇష్టం లేదు. మా బంధువులంతా కూడా పరువు తీశారు అనే ఫీల్‌లో ఉంటారు. కానీ ఈసారి పొట్టేల్‌ సినిమాతో మా కుటుంబ సభ్యులతో పాటు బంధువుల మెప్పు పొందుతాను, మా అమ్మ ఈ సినిమాతో నా గురించి గర్వంగా చెప్పుకుంటుంది అనే కాన్పిడెన్స్‌ నాలో ఉండేది. కానీ ఈ ప్రశ్న ఎదురైనప్పుడు నాకు అంతా రివర్స్‌ అయినట్లు అనిపించింది. ఒకవేళ నాకు సక్సెస్‌ వచ్చినా... ఇలాంటివి చూసినప్పుడు ఈ అమ్మాయి ఇలా చేసింది కాబట్టే అక్కడి వరకు వెళ్లింది... సక్సెస్‌ వచ్చింది అని అనుకుంటారు. 

ఎగైన్‌ సేమ్‌ ప్రాబ్లమ్‌.. మా అమ్మ ఏ ఫంక్షన్‌కు వెళ్లినా డైరెక్ట్‌గా, ఇన్‌డైరెక్ట్‌గా నా గురించి బ్యాడ్‌గా మాట్లాడతారు. సో.. నేను ఎదురుచూసిన మా అమ్మ ప్రౌడ్‌ మూమెంట్‌ వెళ్లిపోయింది అనిపించింది. నాకు ఆ ప్రశ్న ఎదురైనప్పుడు పెద్ద బాధ అనిపించలేదు కానీ తరువాత ఆ ప్రశ్నను చూసి బాధపడ్డాను. కాకపోతే మీడియా వాళ్లంతా నాకు సపోర్ట్‌ చేయడం, అలా అడిగినందుకు మిగతా జర్నలిస్టులు సారీ చేప్పడంతో నా మీద వాళ్లకున్న అభిమానం చూసి ఆనందపడ్డాను'' అని చెప్పుకొచ్చారు. 
Ananya Nagalla
Pottel
Ananya nagalla latest news
Pottel press meet
Ananya nagalla interview
Cinema

More Telugu News