Vikrant Massey: భార్య కాళ్లు మొక్కిన యువ హీరో... నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

Bollywood Young Hero Vikrant Massey who Planted his Wifes Legs Photos goes Viral on Social Media
  • క‌ర్వా చౌత్ సెల‌బ్రేష‌న్స్ తాలూకు ఫొటోల‌ను పంచుకున్న విక్రాంత్ మ‌స్సే
  • భార్య శీత‌ల్ కాళ్లు మొక్కిన బాలీవుడ్ హీరో
  • '12th ఫెయిల్' మూవీతో విక్రాంత్‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు
క‌ర్వా చౌత్ పండుగ‌ను ఉత్త‌రాదిలో ఘ‌నంగా జ‌రుపుకుంటార‌నే విష‌యం తెలిసిందే. భ‌ర్త ఆయురారోగ్యాల‌తో వ‌ర్ధిల్లాల‌ని, ఆనందంగా ఉండాల‌ని భార్య‌లు రోజంతా ఉపవాసం ఉండి, ఈ పూజ‌ను చేస్తుంటారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌ల చాలామంది బాలీవుడ్ జంట‌లు ఈ సెలబ్రేష‌న్స్‌లో పాల్గొని త‌మ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. 

తాజాగా '12th ఫెయిల్' మూవీ హీరో విక్రాంత్ మ‌స్సే కూడా త‌మ క‌ర్వా చౌత్ తాలూకు ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. విక్రాంత్‌, అత‌ని భార్య శీత‌ల్ ఫొటోల్లో చ‌క్క‌గా క‌నిపించారు. అంద‌రిలానే ఆమె కూడా త‌న భ‌ర్త విక్రాంత్ ముఖాన్ని జ‌ల్లెడ‌లో చూసి, కాళ్ల‌కు న‌మ‌స్క‌రించి ఆశీర్వాదం తీసుకోవ‌డం ఫొటోల్లో ఉంది. అదే స‌మ‌యంలో విక్రాంత్ కూడా త‌న భార్య కాళ్లు మొక్కాడు. 

ఈ బాలీవుడ్ జంట ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. వీటిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు. కాగా, '12th ఫెయిల్' మూవీతో విక్రాంత్‌కు దేశ‌వ్యాప్తంగా గుర్తింపు ద‌క్కిన విష‌యం తెలిసిందే.    
Vikrant Massey
Bollywood
12th Fail Movie

More Telugu News