Jagan: హత్యకు గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించనున్న జగన్

Jagan to go to Badvel tomorrow
  • రేపు కడప జిల్లాలో పర్యటించనున్న వైసీపీ అధినేత
  • గుంటూరు నుంచి హెలికాప్టర్ లో బద్వేల్ కు వెళ్లనున్న జగన్
  • రేపు రాత్రికి పులివెందులలో బస
బద్వేల్ లో ప్రేమోన్మాది చేతిలో ఇంటర్ బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించనున్నారు. రేపు కడప జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. 

గుంటూరు నుంచి హెలికాప్టర్ లో ఆయన బద్వేల్ కు చేరుకుంటారు. బద్వేల్ లోని రామాంజనేయ నగర్ లో ఉన్న బాలిక కుటుంబ సభ్యులను ఆయన కలవనున్నారు. వారిని పరామర్శించి, ఓదార్చనున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందులకు చేరుకుంటారు. రేపు రాత్రి పులివెందులలో బస చేస్తారు. మరోవైపు, బాలికను హత్య చేసిన విఘ్నేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.
Jagan
YSRCP
Kadapa

More Telugu News