Lucky Baskhar: సిగరెట్‌, ఆల్కహాల్‌ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ!... 'లక్కీ భాస్కర్‌' ట్రైలర్‌ రివ్యూ

More money than cigarettes and alcohol Lucky Bhaskar trailer review
  • దుల్కర్‌ సల్మాన్‌ లక్కీభాస్కర్‌ ట్రైలర్‌ విడుదల 
  • బ్యాంకింగ్‌ సెక్టార్‌ నేపథ్యంలో కథ 
  • ట్రైలర్‌లో ఆకట్టుకున్న సంభాషణలు
దుల్కర్‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'లక్కీ భాస్కర్‌'. వెంకీ అట్లూరి దర్శకుడు. సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ నేడు విడుదల చేశారు. బ్యాంకింగ్ సెక్టార్‌ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రం ట్రైలర్‌ చూస్తే మనిషి జీవితంలో డబ్బు ప్రాధాన్యత ఎంతటిదో తెలియజేస్తుంది. 

ఆరు వేల జీతంతో కుటుంబాన్ని పోషించే భాస్కర్‌ కోట్లకు ఎలా పడగలెత్తాడు అనే విషయాన్ని ఆస్తక్తిగా, ఉత్కంఠగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా కథను ట్రైలర్‌లో తెలియజేశారు. కాలిగోటి నుంచి తల వరకు ఏమి కావాలో కొనుక్కో... అంటూ దుల్కార్, మీనాక్షితో చెప్పే సంభాషణతో పాటు జూదంలో ఎంత గొప్పగా ఆడామో కాదో.. ఎక్కడ ఆపామో ముఖ్యం!... సిగరెట్‌, ఆల్కహాల్‌ కన్నా డబ్బు ఇచ్చే కిక్‌ ఎక్కువ లాంటి డైలాగులు ఈ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. 
Lucky Baskhar
Dulquer Salmaan
Venky Atluri
Meenakshi chowdary
Naga vamsi
Lucky bhaskar release date
Cinema
Lucky baskhar trailer review

More Telugu News