ముంబైలో కృష్ణదాస్ కీర్తనలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ
- ముంబైలోని నెస్కోలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో కోహ్లీ దంపతులు
- కోహ్లీ, అనుష్క శర్మ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన నిర్వాహకులు
- కృష్ణదాస్ కీర్తనకు గతంలోనూ హాజరైన కోహ్లీ దంపతులు
ఈరోజు ముంబైలోని కృష్ణదాస్ లైవ్ కార్యక్రమంలో కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు... వారు ప్రశాంతమైన వాతావరణంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. అక్కడ వారి హాజరు ప్రత్యేకంగా నిలిచిందన్నారు. కృష్ణదాస్ కీర్తనకు ఈ జంట గతంలోనూ హాజరైంది. ఈ ఏడాది జులైలో లండన్‌లో కృష్ణదాస్ కీర్తనలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అనుష్క శర్మ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.