BJP: వయనాడ్‌లో ప్రియాంకగాంధీపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థి ఎవరంటే...?

BJP fields Navya Haridas against Priyanka Gandhi for Wayanad Lok Sabha bypoll
  • వయనాడ్ నుంచి నవ్య హరిదాస్‌ను బరిలోకి దించుతున్న బీజేపీ
  • ఇప్పటికే ప్రియాంక గాంధీని ప్రకటించిన కాంగ్రెస్
  • పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ... నవ్య హరిదాస్‌ను ఇక్కడి నుంచి బరిలోకి దింపుతోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల అభ్యర్థులను బీజేపీ ఈ రోజు ప్రకటించింది.

వయనాడ్ నుంచి ప్రియాంకగాంధీపై పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోజీకోడ్ కార్పోరేషన్ కౌన్సిలర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఆమె కేరళ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. అదే నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
BJP
Priyanka Gandhi
Wayanad

More Telugu News