Renu Desai: గణపతి, చండీ హోమాన్ని నిర్వహించిన రేణు దేశాయ్

Renu Desai performs Homam
  • హోమంలో పాల్గొన్న అకీరా నందన్
  • శరద్ పూర్ణిమ సందర్భంగా హోమం నిర్వహించామన్న రేణు దేశాయ్
  • మన సంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలని సూచన
సినీ నటి రేణు దేశాయ్ గణపతి, చండీ హోమాన్ని నిర్వహించారు. ఈ హోమంలో ఆమె కుమారుడు అకీరా నందన్ కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. 

మన సంస్కృతి భవిష్యత్ తరాలకు తెలియాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. శరద్ పూర్ణిమ సందర్భంగా హోమం నిర్వహించినట్టు తెలిపారు. శరద్ పూర్ణిమకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పారు. మన పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాలు, ఆచారాలను పిల్లలకు నేర్పించాలని అన్నారు. ఆర్భాటంగా పూజలు చేసుకోవాల్సిన అవసరం లేదని, పూజ సమయంలో భక్తిపైనే దృష్టి సారించాలని చెప్పారు. 
Renu Desai

More Telugu News