Shahrukh Khan: కావాల్సిన దానికంటే ఎక్కువ సంపద దేవుడు ఇచ్చాడు.. నా చివరి కోరిక ఇదే: షారుక్ ఖాన్

Shahrukh Khan about his last wish
  • లొకేషన్ లో నటిస్తూనే చనిపోవాలనేది తన చివరి కోరిక అన్న షారుక్
  • దర్శకుడు కట్ చెప్పిన తర్వాత కూడా తాను లేవకూడదని వ్యాఖ్య
  • దేవుడు తనకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడన్న షారుక్
నటుడిగా తనది 36 ఏళ్ల ప్రయాణమని బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తెలిపారు. 23 ఏళ్లకే తాను నటుడిని అయ్యాయని... 27 ఏళ్లకు సినిమా హీరో అయ్యానని చెప్పారు. భగవంతుడు తనకు అద్భుతమైన జీవితాన్ని, కోట్లాది మంది అభిమానులను, కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదనని ఇచ్చారని తెలిపారు. తనకు ఒక కోరిక మిగిలి ఉందని... లొకేషన్ లో నటిస్తూనే తాను చనిపోవాలనేది తన చివరి కోరిక అని షారుక్ అన్నారు. దర్శకుడు యాక్షన్ చెప్పగానే తాను చనిపోవాలని, కట్ చెప్పిన తర్వాత కూడా లేవకూడదని చెప్పారు. 
Shahrukh Khan
Bollywood

More Telugu News