Telangana: ఈ నెల 23న సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం

Telangana Cabinet meeting on October 23
  • సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ
  • హాజరు కానున్న మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు
  • కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చ
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చించనున్నారు.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు, హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత, రెవెన్యూ చట్టం, మూసీ బాధితులకు న్యాయం చేసే అంశం, వరద నష్టం, రైతు భరోసాపై చర్చించే అవకాశముంది. అన్ని వివరాలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి. 

అటు, ఈ నెలాఖరున అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Telangana
Telangana Cabinet
Hyderabad

More Telugu News