Bengaluru Test: ముగిసిన రెండో రోజు ఆట... టీమిండియాపై కివీస్ దే పైచేయి

Kiwis gets crucial lead against Team India in day 2 of Bengaluru Test
  • బెంగళూరులో టీమిండియా, న్యూజిలాండ్ తొలి టెస్టు
  • మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 46 ఆలౌట్
  • నేడు ఆట చివరికి 3 వికెట్లకు 180 పరుగులు చేసిన కివీస్
టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య బెంగళూరులో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఇవాళ కివీస్ దే పైచేయిగా నిలిచింది. నిన్న తొలి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం కాగా, ఇవాళ్టి ఉదయం టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బౌలర్ల విజృంభణతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆలౌట్ అయింది. 

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ ఆధిక్యం 134 పరుగులు. రచిన్ రవీంద్ర 22, డారిల్ మిచెల్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు, కివీస్ ఓపెనర్ డెవాన్ కాన్వే సెంచరీ చేజార్చుకున్నాడు. 105 బంతులు ఎదుర్కొన్న కాన్వే 11 ఫోర్లు, 3 సిక్సులతో 91 పరుగులు చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్ 15, విల్ యంగ్ 33 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ 1, కుల్దీప్ యాదవ్ 1, జడేజా 1 వికెట్ తీశారు.
Bengaluru Test
Team India
New Zealand
First Innings
Day 2

More Telugu News