Sheik Hasina: షేక్ హసీనాను నవంబరు 18 లోగా అరెస్ట్ చేయండి... క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశాలు

Bangladesh tribunal issues arrest warrant against ex PM Sheikh Hasina
  • రిజర్వేషన్లపై హింసాత్మకంగా మారిన విద్యార్థుల ఉద్యమం
  • ఈ విషయంలో ప్రాసిక్యూషన్ కోరుతూ పిటిషన్లు దాఖలు
  • విచారణ జరిపి ఉత్తర్వులు జారీ చేసిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. షేక్ హసీనాతో పాటు మరో 45 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అరెస్ట్ వారెంట్లు జారీ అయిన వారిలో అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు ఉన్నారు.

రిజర్వేషన్లపై విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో జరిగిన హింస, ఇతర నేరారోపణలపై క్రైమ్స్ ట్రైబ్యునల్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ మహ్మద్ గోలం ముర్తాజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆఫ్ బంగ్లాదేశ్ చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. నవంబర్ 18వ తేదీ లోగా షేక్ హసీనా సహా 46 మందిని అరెస్ట్ చేసి హాజరుపరచాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.
Sheik Hasina
Bangladesh
India

More Telugu News