Lady Justice: న్యాయదేవతకు ‘కళ్ల గంతలు’ తొలగింపు.. చారిత్రాత్మక ఘట్టం

blindfold of statue of Lady Justice has been removed and the sword replaced with Constitution
  • ఒక చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం ప్రతిమ ఏర్పాటు
  • బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో కొత్తగా రూపుదిద్దుకున్న న్యాయదేవత
  • సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో నూతన విగ్రహం ఏర్పాటు
బ్రిటీష్ కాలం నాటి పేర్లు, గుర్తుల సవరణల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కోర్టులు, లీగల్ ఛాంబర్లు, సినిమాలలో కళ్లకు గంతలు కట్టి కనిపించే ‘న్యాయ దేవత’ విగ్రహం రూపు మారింది. కళ్ల గంతలను సుప్రీంకోర్ట్ తొలగించింది. అంతేకాదు న్యాయ దేవత ఒక చేతిలో ఉండే ఖడ్గం స్థానంలో రాజ్యాంగ ప్రతిని ఉంచింది. బ్రిటీష్ కాలం నాటి దుస్తుల స్థానంలో చీరకట్టుతో విగ్రహాన్ని రూపొందించారు. ఈ మేరకు కొత్త విగ్రహాన్ని సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు.

భారతీయ న్యాయవ్యవస్థ చిహ్నానికి కొత్త రూపును తీసుకురావడమే లక్ష్యంగా ఈ కీలక మార్పులు జరిగాయి. తద్వారా ‘చట్టం ఇకపై గుడ్డిది కాదు’ అని సుప్రీంకోర్ట్ స్పష్టమైన సందేశం ఇచ్చినట్టు అయింది. ఈ మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చొరవ చూపించారు. మార్పుల అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. 

కాగా మునుపటి న్యాయ దేవత విగ్రహం ఒక చేతిలో శిక్షకు చిహ్నంగా ఖడ్గం ఉండేది. దాని స్థానంలో అందరికీ సమానత్వాన్ని అందించే రాజ్యాంగాన్ని ఉంచారు. వలస వారసత్వాన్ని అధిగమించి ముందుకు వెళ్లాల్సిన తరుణం ఇదని సీజైఐ డీవై చంద్రచూడ్ భావించారని సుప్రీంకోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘చట్టం గుడ్డిది కాదు. అందరినీ సమానంగా చూస్తుంది’’ అని ఆయన అన్నారని సమాచారం. అందుకే న్యాయ దేవత కొత్త రూపంలో ఈ సూత్రం ప్రతిబింబించేలా చూసుకున్నారు.
Lady Justice
Statue of Lady Justice
Supreme Court
CJI Chandrachud

More Telugu News