VH: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ భేటీ

VH meets HYDRA commissioner Ranganath
  • హైడ్రా కార్యాలయంలో రంగనాథ్‌ను కలిసిన వీహెచ్
  • అంబర్‌పేట బతుకమ్మకుంట వ్యవహారంపై చర్చించిన వీహెచ్
  • హైడ్రాపై కేటీఆర్ కీలక సమావేశం
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో సమావేశమయ్యారు. హైడ్రా కార్యాలయంలో కమిషనర్‌ను కలిసిన వీహెచ్... అంబర్‌పేటలో బతుకమ్మకుంట భూవ్యవహారంపై చర్చించారు. అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను ఆక్రమించారని, నిర్మాణాలు చేపట్టారని వీహెచ్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా, హైడ్రా వచ్చిన నేపథ్యంలో ఆయన బతుకమ్మకుంట అంశాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు.

హైడ్రాపై కేటీఆర్ కీలక సమావేశం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైడ్రాపై రేపు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన భేటీ కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరగనుంది.
VH
HYDRA
Hyderabad
Congress

More Telugu News