ఆస్ట్రేలియా వర్కింగ్ వీసాకు భారీ స్పందన.. 1000 వీసాలకు 40వేల మంది భారతీయుల దరఖాస్తు
ఈ మేరకు ఆస్ట్రేలియా వలసల శాఖ సహాయమంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక ఈ వీసా పొందినవారు ఆ దేశంలో 12 నెలల పాటు స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆ సమయంలో వీసాదారులను చదువుకోవడానికి, ఉద్యోగం చేయడానికి, నివాసం ఉండడానికి అనుమతించడం జరుగుతుంది.
వీసా లభించిన వారు 2025 ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చు. 18-30 ఏళ్ల వయసు ఉన్న భారతీయులు ఈ వర్కింగ్ హాలిడే మేకర్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.