Omar Abdullah: అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ సీఎంగా ప్రమాణం చేయనున్న ఒమర్ అబ్దుల్లా

JK Lt Governor invites Omar Abdullah to take oath as Chief Minister
  • అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచిన ఎన్సీ-కాంగ్రెస్ కూటమి
  • ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఎల్జీకి కూటమి విజ్ఞప్తి
  • కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన ఎల్జీ
అక్టోబర్ 16న జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ సీట్లు దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లానే సీఎం అంటూ... ఫలితాలు రాగానే ఆ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. తాజాగా, రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఎన్నికల్లో గెలిచి మెజార్టీ సీట్లు సాధించడంతో ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు మెజార్టీకి కావాల్సిన సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌తో నేషనల్ కాన్ఫరెన్స్ జత కట్టింది. ఈ క్రమంలో శాసన సభా పక్ష నేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరాయి. దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారానికి ఎల్జీ ఆహ్వానించారు.
Omar Abdullah
Jammu And Kashmir
BJP
Congress

More Telugu News