Narendra Modi: బాధ్యతలు స్వీకరించాక తొలిసారి... ప్రధాని మోదీని కలిసిన ఢిల్లీ సీఎం అతిశీ

Delhi CM Atishi calls on PM Modi for first time after assuming CM office
  • ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడి
  • ప్రధాని మోదీని కలిశానంటూ ఎక్స్ వేదికగా వెల్లడించిన అతిశీ
  • సీఎం నివాసం కేటాయింపుపై ఎల్జీతో మాటల యుద్ధం నేపథ్యంలో ప్రాధాన్యత
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి ప్రధానిని కలిశారు. ప్రధానిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ... ఢిల్లీ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం అందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో ప్రభుత్వానికి మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో ముఖ్యమంత్రి... ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈరోజు ప్రధాని నరేంద్రమోదీని కలిశానని ఎక్స్ వేదికగా సీఎం అతిశీ పేర్కొన్నారు. మన దేశ రాజధానిలో సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం మధ్య సహకారం ఉంటుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. 
Narendra Modi
Atishi
New Delhi
BJP

More Telugu News