Pawan Kalyan: సినిమాల్లో ఎవరితోనూ పోటీ పడను: పవన్ కల్యాణ్

I dont compete with anyone in film industry says Pawan Kalyan
  • ముందు బాధ్యత, ఆ తర్వాతే వినోదమన్న పవన్
  • ప్రతి నటుడు ఒక్కో స్థాయిలో నిష్ణాతుడని వ్యాఖ్య
  • అందరూ బాగుండాలని కోరుకుంటానన్న పవన్
కృష్ణా జిల్లా కంకిపాడులో పల్లె పండుగ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా... అభిమానులు 'ఓజీ' అంటూ నినాదాలు చేశారు. దీంతో, పవన్ సినిమాల గురించి కాసేపు మాట్లాడారు. ముందు బాధ్యత, ఆ తర్వాత వినోదమని ఆయన అన్నారు.

ముందు యువతకు ఉపాధి కల్పించాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని... ఆ తర్వాతే విందులు, వినోదాలు అని వ్యాఖ్యానించారు. సినిమాలలో తాను ఎవరితో పోటీ పడనని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఒక్కో స్థాయిలో నిష్ణాతులేనని అన్నారు. బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని ఇలా అందరూ బాగుండాలని కోరుకునేవాడినని చెప్పారు.
Pawan Kalyan
Janasena

More Telugu News