Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి సమీపంలో తుపాకులతో పట్టుబడ్డ వ్యక్తి

A man found with loaded handgun was arrested near Donald Trump rally in California
  • కాలిఫోర్నియాలో ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కలకలం
  • షాట్‌గన్, లోడెడ్ తుపాకీతో పట్టుబడ్డ వ్యక్తి
  • దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నామినీ డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండు సార్లు హత్యాయత్నాలు జరిగిన క్రమంలో మరో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. కాలిఫోర్నియాలో శనివారం ఆయన నిర్వహించిన ఓ ఎన్నికల ర్యాలీకి సమీపంలో ఓ వ్యక్తి షాట్‌గన్, లోడ్ చేసిన ఓ తుపాకీతో పట్టుబడ్డాడు. కాలిఫోర్నియాలోని కోచెల్లాలో ఈ ఘటన జరిగిందని, అక్రమ ఆయుధాలు కలిగివున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు రివర్‌సైడ్ కౌంటీ పోలీసులు ఆదివారం ప్రకటించారు.

నిందితుడిని వెమ్ మిల్లర్‌గా (49) గుర్తించామని, లాస్ వెగాస్‌కు చెందినవాడని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడని, జనవరి 2న కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ట్రంప్ ర్యాలీకి సమీపంలో చెక్‌పాయింట్‌ను నిర్వహిస్తున్న పోలీసులకు నిందితుడు మిల్లర్ ఎస్‌యూవీ కారులో పట్టుబడ్డాడని, కారు నడుపుతుండగా అతడిని అరెస్టు చేశామని వివరించారు. నిందితుడు నల్లజాతి వ్యక్తి అని పేర్కొన్నారు. గన్ లోడ్ చేసి ఉండడం, మరోవైపు అతడి వద్ద అధిక సామర్థ్యం కలిగిన మ్యాగజైన్‌ ఉండడంతో దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. డొనాల్ట్ ట్రంప్‌పై రెండు హత్యాయత్నాల నేపథ్యంలో ఈ తాజా ఘటన వెలుగుచూసింది.

నిందిత వ్యక్తి అరెస్టు గురించి తమకు తెలుసునని, శనివారం జరిగిన ఈ ఘటనలో ట్రంప్‌కి గానీ, ర్యాలీకి హాజరైన వారికి గానీ ఎటువంటి హాని జరగలేదని ఎఫ్‌బీఐ ప్రకటించింది.  దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్ అటార్నీ కార్యాలయంతో కలిసి ఎఫ్‌బీఐ సంయుక్త ప్రకటన విడుదల చేసింది.
Donald Trump
US Presidential Polls
USA
California

More Telugu News