Traffic Jam: విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్

Huge traffic jam on Vijayawada Hyderabad highway
  • ముగిసిన దసరా నవరాత్రులు
  • సొంతూళ్లకు వెళ్లిన వాళ్లు హైదరాబాద్ తిరుగు పయనం
  • వేలాదిగా రోడ్డెక్కిన వాహనాలు
దసరా నవరాత్రులు ముగిశాయి. పండుగ సెలవులకు సొంతూళ్లకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో, విజయవాడ-హైదరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాదిగా వాహనాలు రోడ్డెక్కడంతో రహదారి రద్దీగా మారింది. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు వాహనాలు నిదానంగా వెళ్లాల్సి వస్తోంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తోంది.
Traffic Jam
Dasara
Vijayawada-Hyderabad
Telangana
Andhra Pradesh

More Telugu News