Manne Krishank: బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు సింగపూర్ సంస్థ లీగల్ నోటీసులు

Singapore company legal notices to Manne Krishank
  • మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీకి సంబంధించి నిరాధార ఆరోపణలు చేశారన్న కంపెనీ
  • క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు పంపించిన మెయిన్ హార్డ్స్ సంస్థ
  • ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీకి సంబంధించి నిరాధార ఆరోపణలు చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్ హార్డ్స్ సంస్థ లీగల్ నోటీసులు పంపించింది. క్రిశాంక్ దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొంది.

తమపై చేసిన ఆరోపణలను ఆయన 24 గంటల్లో వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే ఆయనపై సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈమేరకు మెయిన్ హార్డ్స్ సంస్థ ఎక్స్ వేదికగా హెచ్చరించింది.
Manne Krishank
BRS
Congress

More Telugu News