Revanth Reddy: నేడు కొండారెడ్డిపల్లిలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy to tour in Kondareddypalli
  • ఈరోజు సాయంత్రం హెలికాప్టర్‌లో సొంతూరుకు సీఎం
  • ప్రతి ఏటా సొంతూరులోనే దసరా జరుపుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి
  • రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్ఠ బందోబస్తు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో నేడు పర్యటించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లికి ఆయన రానున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈరోజు సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన హైదరాబాద్ నుంచి కొండారెడ్డిపల్లి చేరుకుంటారు. ఆయన రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ దసరా పండుగ నాడు కొండారెడ్డిపల్లికి వస్తుంటారు. గ్రామస్థులతో కలిసి పండుగను జరుపుకుంటారు. రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో గ్రామంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Revanth Reddy
Congress
Dasara
Telangana

More Telugu News