Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చిరంజీవి

Chiranjeevi wishes Amitabh Bachchan on his 82nd birthday
  • నేడు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు
  • 82వ జన్మదినం జరుపుకుంటున్న బాలీవుడ్ బిగ్ బి
  • సోషల్ మీడియాలో విషెస్ వెల్లువ
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నేడు 82వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలుపుతున్నారు. 

తాజాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ ద్వారా అమితాబ్ బచ్చన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రియాతిప్రియమైన అమితాబ్ బచ్చన్ గారికి ఈ పుట్టినరోజు ఎంతో సంతోషకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయుష్షుతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను. మీ అసమాన నటనా ప్రతిభతో కోట్లాది మందిని ఉర్రూతలూగించాలని, స్ఫూర్తిగా నిలవాలని ఆశిస్తున్నాను" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. 

కాగా, దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో కలిసి నటించడం తెలిసిందే.
Amitabh Bachchan
Birthday
Chiranjeevi
Wishes
Bollywood
Tollywood

More Telugu News