Bank Account: ఓ మహిళ బ్యాంకు ఖాతాలోకి రూ.999 కోట్లు... ఫ్రీజ్ చేసిన బ్యాంకు

Bank freezes an account after deposited Rs 999 crores mistakenly
  • బెంగళూరులో ఘటన
  • సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఓ మహిళకు ఖాతా
  • ఉన్నట్టుండి కోట్లాది రూపాయలు జమ
  • ఏం జరిగిందో తెలుసుకునే లోపే నగదు వెనక్కి తీసుకున్న బ్యాంకు
ఎవరి బ్యాంకు ఖాతాలో అయినా ఉన్నట్టుండి, వారికి తెలియకుండానే నగదు జమ అయితే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ విధంగా కోట్లాది రూపాయలు బ్యాంకు అకౌంట్ లో పడితే భయం కూడా కలుగుతుంది. బెంగళూరుకు చెందిన ఓ మహిళకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. 

ప్రభాకర్ అనే వ్యక్తి బెంగళూరులో ఐఐఎంలో కాఫీ షాప్ నిర్వహిస్తున్నారు. ఆయన భార్యకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. కొన్నిరోజుల కిందట ఆమె బ్యాంకు ఖాతాలో రూ.999 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు గుర్తించారు. అంత డబ్బు ఎలా వచ్చింది అని తెలుసుకునేలోపే... బ్యాంకు ఆ ఖాతాను ఫ్రీజ్ చేసింది. దాంతో, వారి సొంతడబ్బును కూడా డ్రా చేసుకునేందుకు వీల్లేక ఆ మహిళ లబోదిబోమంటున్నారు. 

ఆ డబ్బు పొరపాటున మహిళ ఖాతాలో జమ అయిందని బ్యాంకు వారు సమాచారం అందించారు. అంతేకాదు, ఆ నగదును వెంటనే వెనక్కి తీసుకున్నారు. అయితే, ఆ మహిళ ఖాతాను మాత్రం ఇంకా పునరుద్ధరించలేదు. ఆమె ఖాతాలోకి అంత డబ్బు ఎలా బదిలీ అయిందన్నదానిపై విచారణ జరుపుతున్నారు. 

విచారణ సంగతేమో కానీ, ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు ఆ అకౌంట్లో ఉండడంతో, ఆ మహిళ కుటుంబం వేదన అంతా ఇంతా కాదు. బ్యాంకు అధికారులకు మెయిల్ ద్వారా తమ విజ్ఞాపన పంపించినా స్పందన లేదని ఆ మహిళ భర్త ప్రభాకర్ వాపోయారు.
Bank Account
Deposit
Woman
Bengaluru

More Telugu News