Ch Malla Reddy: బీజేపీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

Malla Reddy invited Kishan Reddy to her grand daughter marriage
మనుమరాలి పెళ్లికి కిషన్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్లిన మల్లారెడ్డి
కేంద్రమంత్రికి ఆహ్వాన పత్రికను అందించిన మల్లారెడ్డి
రేవంత్ రెడ్డి, చంద్రబాబులకూ ఇంతకుముందే ఆహ్వాన పత్రిక అందజేత
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తన మనుమరాలి పెళ్లికి కేంద్రమంత్రిని ఆహ్వానించేందుకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు.

కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్నారని తెలియడంతో తన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డితో కలిసి ఆయన నేరుగా అక్కడకు వెళ్లి పెళ్లి పత్రికను అందించారు. తన మనుమరాలి పెళ్లికి రావాలని ఆహ్వానించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి వారికి కూడా ఆహ్వాన పత్రికను అందించారు.
Ch Malla Reddy
BRS
G. Kishan Reddy
BJP

More Telugu News