రాహుల్ గాంధీ ప్రజల మధ్య చిచ్చుపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: బీజేపీ ఎంపీ
- మహారాష్ట్ర, జార్ఖండ్‌లలోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా
- దేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రజలు బీజేపీకి అండగా నిలవాలని వ్యాఖ్య
- మైనార్టీలను కాంగ్రెస్ వాడుకుంటే, మోదీ ప్రభుత్వం అండగా నిలిచిందన్న విశ్వేశ్వర్ రెడ్డి
ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశం సుభిక్షంగా ఉండాలన్నా... అభివృద్ధి పథం వైపు నడవాలన్నా ప్రజలు బీజేపీకి అండగా నిలవాలన్నారు. దేశం మీద ప్రేమ ఉన్నవారు బీజేపీ తప్ప ఇతర పార్టీల వైపు చూడరని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను వాడుకుందని ఆరోపించారు. కానీ మోదీ ప్రభుత్వం మాత్రం వారికి అండగా నిలిచిందన్నారు.
వేర్పాటువాదులతో పొత్తు పెట్టుకునే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి దేశం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన నేషనల్ కాన్ఫరెన్స్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నదన్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తుందో చెప్పాలని నిలదీశారు.